Listen to this article

జనం న్యూస్. జనవరి 10. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని విష్ణు వైపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మన్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కళాశాలలో శుక్రవారం నాడు సాంప్రదాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో కళాశాలకు విచ్చేసి పలు సంస్కృతిక కార్యక్రమాలు భోగి మంటలు. బోనాలు. బతుకమ్మ. ముగ్గుల పోటీలు. నిర్వహించగా. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. ఏ.రమేష్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సాంప్రదాయ దినోత్సవాన్ని కళాశాలలో నిర్వహించడం జరిగిందని మన భారతదేశ సంప్రదాయాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.