జనం న్యూస్ నవంబర్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి గ్రామపంచాయతిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థి పేంటు ఎన్నికల రణరంగంలో దిగడంతో ప్రచారానికి మరింత వేడి వచ్చింది. గ్రామ ప్రజల నుంచి అభ్యర్థికి విశేష మద్దతు లభిస్తున్నట్లు స్థానికంగా కనిపిస్తోంది. అభివృద్ధి, పారదర్శక పాలన, గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల పురోభివృద్ధి తన లక్ష్యాలని పేర్కొంటూ పేంటు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాల మెరుగుదలపై స్పష్టమైన హామీలు ఇవ్వడంతో యువత, మహిళలు సహా అన్ని వర్గాల ఓటర్లలో అభ్యర్థిపై నమ్మకం పెరుగుతోంది.గ్రామ ప్రజలు ఏకకంఠంతో ఈసారి పేంటును భారీ మెజారిటీతో గెలిపించాలని సంకల్పం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే, అభ్యర్థి విజయం ఖాయమనే అభిప్రాయం స్థానిక రాజకీయ విశ్లేషకులది.


