Listen to this article

జనం న్యూస్‌ 27 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

గజపతినగరం మండలం భూదేవిపేటకి చెందిన జగ్గినేని గౌరీ (43) కడుపునొప్పి కారణంగా ఈనెల 25 సాయంత్రం గడ్డి మందు తాగిందని గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుమార్తె డొంక పూజిత ఫిర్యాదు చేసిందన్నారు. గౌరి మృతిపై కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.