Listen to this article

జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా:

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో గుమ్మడిదల మండల పరిధిలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపిక కార్యక్రమాలు వేగంగాకొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు మాజీ జెడ్పిటిసి కోలన్ బాల్ రెడ్డి,రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ కలిసి పాల్గొన్నారు.పార్టీ అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియలో భాగంగా నాయకులు గ్రామ స్థాయి కార్యకర్తలు, పెద్దలతో సమావేశం జరిపి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం కొన్ని గ్రామాల బీఆర్ఎస్ అభ్యర్థుల సర్పంచ్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని, ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం సాధించేలా చేయాలని నాయకులు కార్యకర్తలను పిలుపునిచ్చారు.గ్రామాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్ శ్రీనివాస్, శంకర్, గణేష్ అప్ప, సాయి భరత్, రామకృష్ణ, తుపాకుల రాజు, కరుణాకర్ రెడ్డి, సత్తయ్య, శేఖర్, గౌడ్, లక్ష్మణ్, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.