Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 27

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కోణిదెల పవన్ కళ్యాణ్ కు మార్కాపురం జిల్లా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ తర్లుపాడు మండల కేంద్రంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, జిల్లా ఏర్పాటు పట్ల తమ సంతోషాన్ని, కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ సందర్బంగా జనసేన మండల నాయకులు వెలుగు కాశీరావు మాట్లాడుతూ మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించడం వలన ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని, ఈ నిర్ణయం ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పాలన వికేంద్రికరణ ద్వారా పరిపాలన సౌలభ్యం సులభ తరం అవుతుందని జిల్లా కేంద్రం కూత దూరం లో ఉండటం వలన పరిపాలన కు ప్రజల కు సమస్యలు తెలుపెందుకు అందుబాటు లో ఉంటుందని జిల్లా వలన పశ్చిమ ప్రకాశం అభివృద్ధి తో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగి నిరుద్యోగ కొరత కూడా తగ్గుతుందని అన్నారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో సొసైటీ చైర్మన్ వెలుగు క్రాంతి కుమార్,మార్కాపురం జనసేన వీర మహిళ సిద్ధం కృష్ణ వేణి, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు సురే సువర్ణ,టిడిపి మండల ఉపాధ్యక్షులు షేక్ ఖైరు, ఎస్ యం సి చైర్మన్ వెన్నా రాజా రామ్ రెడ్డి, తర్లుపాడు బూత్ కన్వీనర్ షేక్ ఖాసీం వలి, మాజీ కోప్షన్ షేక్ అఫ్రోజ్ జనసేన నాయకులు పఠాన్ కరీముల్లా,గంజరపల్లి మహేష్,కొండెబోయిన సునీల్, గుంటు మోషే, చీకటి శివకాశీ,టిడిపి నాయకులు బొప్పరాజు శ్రీనివాసులు, షేక్ బాషా,షేక్ బాదుల్ల,గుంటు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు