Listen to this article

జనం న్యూస్ నవంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


శాయంపేట మండలంలోని పత్తి పాక గ్రామంలో వరి ధాన్యం కొను గోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలింపులో తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరిం చాల్సి ఉందని ఆరా తీశారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలు సుకున్నారు. రైతులకు నీడగా టెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది వడ్ల తేమ శాతా న్ని పరిశీలించి నిబంధనల మేరకు తాలు మట్టిలేని వడ్లను వెంటనే కొనుగోలు చేయాల న్నారు వడ్ల కొనుగోలు వివ రాలు క్యాబ్ ఎంట్రీ లపై ఆరా తీశారు. ఈ విషయంపై కలెక్టర్ మండిపడ్డారు. ధాన్యం కొను గోలు ఆలస్యం కాకూడదు రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ వని పంట కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లను వెం టనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులను ఇబ్బం దులను గురి చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తాత్కాలిక మండల వ్యవ సాయ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు……