Listen to this article

జనం న్యూస్ నవంబర్ 28 సంగారెడ్డి జిల్లా

గుమ్మడిదల మండల కేంద్రంలోని సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం నాడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, వెంకటేశంగౌడ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కట్టుబడి పనిచేయాలని, ప్రజల్లో మంచి సేవలు అందించగల, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి,గణేష్ అప్ప, గోపాల్, కొండల్ రెడ్డి మొగులయ్య, తుపాకుల రాజు,నరహరి,సత్యనారాయణ, శేఖర్ గౌడ్, లక్ష్మణ్,నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు హాజరయ్యారు.