Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్‌ 30 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లా ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసి, రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్సుకు బదిలీ అయిన జి.నాగేశ్వరరావుకు జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ నవంబరు 29న జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – ఎఆర్ అదనపు ఎస్పీగా సంవత్సరం పాటు జిల్లా పోలీసుశాఖలో విశిష్టమైన సేవలందించారన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణలో సమర్ధవంతంగా వ్యవహరించారన్నారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా ఆర్మ్ డ్ రిజర్వు పోలీసులకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. ముఖ్య వ్యక్తుల భద్రత, మోటారు ట్రాన్స్పోర్టు ఆర్గనైజేషన్, వెల్ఫేర్, స్పెషల్ పార్టీస్, హెడ్ క్వార్టరు విధులను సమర్ధవంతంగా నిర్వహించి, జిల్లా ఆర్మ్డరిజర్వు విభాగంకు మంచి పేరు తీసుకొని వచ్చారన్నారని అదనపు ఎస్పీ (ఎఆర్) సేవలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కొనియాడారు.
అనంతరం, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పూలమాల, సాలువలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ డిఎస్పీ ఈ.కోటిరెడ్డి, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, డిపిటిసి డిఎస్పీ వీరకుమార్, పలువురు సీఐలు, ఆస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.