జనం న్యూస్ డిసెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీగీతా
జయంతి సందర్భంగా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయ సన్నిధిలో అమలాపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఆ కొండి శంకర శాస్త్రి (బోటనీ లెక్చరర్) వారి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రంధి నారాయణమూర్తి వారి చేతుల మీదుగా వారిని దుశ్యాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సాయిబాబా, రామకృష్ణ పరమహంస, పవన్ కుమార్, ఫణికాంత్ శాస్త్రి, గ్రంధి నారాయణమూర్తి, ఆ కొండి వెంకట సూర్యనారాయణమూర్తి, సూర్యకాంతం, ఆణి విళ్ళ లక్ష్మి, కోట వెంకటలక్ష్మి, ఆ కొండి గిరిజ, గ్రంథాలయం సభ్యులు తులసి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. వచ్చిన భక్తులందరూ శంకర్ శాస్త్రి గారి ఆశీర్వచనాలు పొందినారు



