Listen to this article

రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 01-

12- 2025యాకూబ్ షరీఫ్, MD, మన గ్రామ ప్రజలకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాను.గ్రామ పంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ మరియు పంచాయతి బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైతే, ఆ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల గ్రాంట్‌ను మంజూరు చేస్తుంది.మన గ్రామాభివృద్ధి పట్ల నా బాధ్యతగా, నేను మన గ్రామంలో సర్పంచ్ మరియు పంచాయతి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, నేను వ్యక్తిగతంగా మరొక 10 లక్షల రూపాయలను గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా అందిస్తాను.ఏకగ్రీవ నిర్ణయం అంటే కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు —మన గ్రామం కలసి ముందుకు సాగాలనే ఐక్యతకు అది ఒక సంకేతం.