జనం న్యూస్ డిసెంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
వివేకానంద నగర్ డివిజన్ శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని కమల ప్రసన్న నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్ ని సందర్శించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ కమల ప్రసన్న నగర్ కమిటీ హాల్లో హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ప్రతినిధి ఎడ్వర్డ్ ఇక్కడ వచ్చిన ప్రజలకు జనరల్ ఫిజీషియన్, డెంటల్ , కంటికి సంబంధించిన డాక్టర్లను ఉంచడం అలాగే ఆరవై టెస్టులకు సంబంధించి టెస్టులు చేయడం వెంటనే రిపోర్ట్స్ ఇవ్వడం కంటికి సంబంధించినటువంటి అద్దాలు అలాగే మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ప్రతినిధి ఎడ్వర్డ్ కి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇలాంటి కార్యక్రమాలు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్లు దగ్గర ఉండి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, జగదీష్ గౌడ్, రవీందర్ రావు, విద్యాసాగర్, మోహన్ రావు, జై, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, శ్రీధర్ రావు, కమల ప్రసన్న నగర్ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్, ఆంజనేయులు, కృష్ణారావు, అంజిరెడ్డి, చలమయ్య, మోహన్, నగేష్, రమణ తదితరులు పాల్గొన్నారు.



