జనం న్యూస్ 01డిసెంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం)
అశ్వాపురం మండలం నెల్లిపాక బంజార గ్రామపంచాయతీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్థులకు “ఓటుకు నోటు కాదు… నోటుకు ఓటు అమ్ముకోవద్దు” అని గొర్రెముచ్చు అరుణ్ తేజ స్పష్టమైన సందేశం ఇస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు ఒక పవిత్ర హక్కు అని, దాన్ని అమ్ముకుంటే ఆ ఓటు విలువ తగ్గిపోతుందని హెచ్చరించారు. డబ్బు ఇచ్చి కొనుకునే ఓటు భవిష్యత్తును దెబ్బతీస్తుందని, గ్రామ అభివృద్ధి నిలిచిపోతుందని వారు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పోరాటాన్ని గుర్తుచేశారు. సమాన హక్కుల కోసం, ప్రతి పౌరుడి ఓటు విలువ కోసం జీవితాంతం పోరాడిన అంబేద్కర్ చూపించిన దారిలో నడవాలని పిలుపునిచ్చారు.“అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కును అమ్ముకోవద్దు. మన ఓటు మన భవిష్యత్తు. డబ్బు కోసం ఓటు ఇచ్చితే అభివృద్ధిని కోల్పోతాం” అని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.నిజమైన నాయకుడిని ఎన్నుకోవడమే గ్రామాభివృద్ధికి మొదటి అడుగు అని, ప్రజలు చైతన్యవంతంగా ఓటు హక్కును వినియోగించాలని వారు కోరుతున్నారు.


