Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇతరుల పై రెచ్చగొట్టే పోస్టులు వాట్సాప్ గ్రూపు లలో పెడితే కఠన చర్యలు తప్పవు అని స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ హెచ్చరించారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో ప్రత్యర్ధులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టులు పెడితే కఠన చర్యలు తీసుకుంటామని ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ర్పచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఏదైనా ఇతరులకు హాని కలిగించే పోస్టులు షేర్ చేసిన నేరంగా పరిగణించి ఇట్టి విషయాలకు గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యులను చేసిన కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు గ్రామాలలో బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే శాఖలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…..