జనం న్యూస్- డిసెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
అంతర్జాతీయ పర్యాటక బౌద్ధ కేంద్రం బుద్ధ వనములో ప్రతి ఆదివారం ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బుద్ధ వనం మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో దమ్మ నాగర్జున విపష్యన కేంద్రం వాలింటర్ల చే ఈ ధ్యాన శిక్షణా తరగతుల కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 11: 30 నిమిషముల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 3.30 నిమిషముల వరకు ధ్యాన తరగతులు నిర్వహిస్తామన్నారు.ధ్యానం చేసుకునేవారు కేటాయించిన సమయంలోపు ధ్యాన మందిరంలోకి చేరుకొని, ధ్యానం ముగిసేవరకు ఉండాలని, ఈ అవకాశాన్ని బుద్ధవనం సందర్శకులు వినియోగించుకోవాలని వారు కోరారు.ధ్యాన మందిరంలో ధ్యాన కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు సందర్శకులు, బుద్ధవనం లోని ఇతర ప్రదేశాలను, సందర్శించాలని, ధ్యానం జరిగే 30. నిమిషాలు మాత్రమే మహస్తూపం లోనికి సందర్శకులను అనుమతించరని ఈవిషయంలో సందర్శకులు సహకరించాలని కోరారు


