Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఐ పోలవరం మండలం టి కొత్తపల్లి పాత ఇంజరం నడవపల్లి గ్రామాలలో గ్రామ ధార్మిక జట్ల ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ 10వ సంవత్సరం పూర్తిచేసుకుని 11 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ తరుణంలో సమస్త పుట్టినరోజు ఘనంగా భజనలు హారతులు సత్సంగం నిర్వహించి జరుపుకోవడం జరిగింది ఈ సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ప్రతి పౌర్ణానికి సామూహిక హారతి రెండవ శనివారం సత్సంగం వారం వారం భజన ప్రతి ఏకాదశ కి గ్రామాలలో నగర సంకీర్తన ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో దేవాలయాలు నిర్మించుట ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాల నుండి తిరుపతి దివ్యదర్శనానికి తీసుకెళ్లడం ప్రత్యేక పూజ ద్వారా మతం మారిన వారిని వెనుకకు తీసుకురావడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని ముమ్మిడివరం ఖండ కన్వీనర్ గొలకోటి సాయిబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో దవులూరి వెంకటేశ్వరరావు కొండేపూడి శ్రీనివాసరావు బొంతు రామారావు గంజా భాస్కర లక్ష్మి పరమట పద్మ నూలు వల్లితయారు సంఘాని ధన కుమారి సఖిలే పద్మ ధర్మ ప్రచారక్ కనకారావు తదితరులు పాల్గొన్నారు