Listen to this article

: జనం న్యూస్‌ 03 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌విజయనగరం

పట్టణంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 66 మంది వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు విచారణలో 64 మందికి రూ. 10,000 చొప్పున జరిమానా.. ఇద్దరికి వరుసగా 2 రోజులు, 5 రోజుల జైలు శిక్ష విధించామని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనం నడపకూడదని, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.