Listen to this article

బిచ్కుంద డిసెంబర్ 3 జనం న్యూస్కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం

బిచ్కుంద బస్టాండ్ వద్ద గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా బుధవారం నాడు ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు చేశారు. వాహనాలపై ఉన్న ఫైన్లు గాని డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ కాగితాలు, ఆర్ సి బుక్కులు తదితర అంశాలతో కూడిన తనిఖీలు చేపట్టి …ప్రతి వాహన డ్రైవరు అన్ని పత్రాలు ఉంచుకోవాలని తెలియజేసినారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా 50 వేల కన్నా ఎక్కువ ఒక వ్యక్తి తీసుకువెళ్లరాదని ఒకవేళ తీసుకొని వెళ్ళినచో వాటికి సంబంధించిన రసీదులు దగ్గర ఉంచుకొని తనిఖీ చేసే అధికారులను సహకారం అందించాలని సూచించారు.