జనం న్యూస్ 04 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
భామిని మండలంలో ఈ నెల 5న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కార చర్యలపై కదలిక వస్తుందా? అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లాలో వేధిస్తున్న ఏనుగుల సమస్య, వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు, విద్యా, వైద్య సిబ్బంది నియామకాలు, గిరిజనుల అభ్యున్నతిపై సీఎం హామీలు, నిధుల కేటాయింపుపై ప్రకటన చేస్తారేమోనని ప్రజలు వేచి చూస్తున్నారు.


