Listen to this article

జనం న్యూస్‌ 04 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

గ్రామాలును అభివృద్ధి చేయటానికి ఎర్త్ సమ్మిట్ దోహదపడుతుందని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత, ఆర్థిక నూతన పరిష్కారాలపై దృష్టి సారిస్తూ, నాబార్డ్, ((ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)లతో కలిసి డిసెంబర్ 5,6 తేదీల్లో గుజరాత్ గాంధీనగర్లో నిర్వహిస్తున్న ఎర్త్ సమ్మిట్ 2025 జరుగుతుందన్నారు. బ్యాంక్ రైతులకు, మహిళా సంఘాలకు సేవలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.