Listen to this article

జనంన్యూస్. 04.సిరికొండ.

నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి సిరికొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ,మరియు ప్రత్యేక నిఘా చర్యలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.అలాగే, సెన్సిటివ్ మరియు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తింపు, బౌండోవర్ వ్యక్తుల పర్యవేక్షణ , బీట్స్ మరియు నైట్ పెట్రోలింగ్ క్రమబద్ధీకరణ వంటి అంశాలపై పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.ఇంకా, సిరికొండ మండల పరిధిలోని సమస్యాత్మక గ్రామ పంచాయితీలను అడిగి తెలుసుకొని, సిరికొండ మరియు కొండాపూర్ పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రతినిధులతో కూడిన చర్చల ద్వారా గ్రామాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.