Listen to this article

సుజాత్‌నగర్: జనం న్యూస్ 05 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం)

సుజాత్‌నగర్ జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్‌లో ప్రముఖ సంఘసేవకుడు ఉబ్బనపల్లి కాశయ్య పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదర్శప్రాయమైన చర్య చేపట్టారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం లభించాలని ముందుచూపుతో ఒక రాగిచెట్టు మరియు వేపచెట్టును స్కూల్ ప్రాంగణంలో నాటారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఎండాకాలంలో పిల్లలకు వేడి తగ్గించి చల్లని వాతావరణం కలిగించే నీడ మరియు పరిశుభ్రమైన ఆక్సిజన్ అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని కాశయ్య తెలిపారు. పర్యావరణ ప్రభావం పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.సుజాత్‌నగర్ వాస్తవ్యుడైన ఉబ్బనపల్లి కాశయ్య చేసిన ఈ సేవా కార్యక్రమం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. పర్యావరణ రక్షణలో ఆయన చేస్తున్న కృషి యువతకు స్పూర్తిగా నిలుస్తోంది.