విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి
ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఇంచార్జ్ యువరాజ్ మర్మాట్.
. జనం న్యూస్. 04, 2025: కొమురం భీమ్ జిల్లా: జిల్లా. స్టాఫ్ఫార్.
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఇంచార్జ్ యువరాజ్ మర్మాట్ అన్నారు.బుదవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు)రాశిమెట్ట మరియు గిరిజన గురుకులం కళాశాల భూశిమెట్ట ను సందర్శించి రిజిస్టర్లు, తరగతిగదులు, ఆశ్రమ పాఠశాలలను మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, విద్యార్థులకు అవసరమైన ఐరన్, సి విటమిన్ టాబ్లెట్లను అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత పొందే విదంగా చూడాలని ఉపాధ్యాయులకి ఆదేశించారు, సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు. దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వసతి గృహ పరిసరాలలో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన విద్యార్థులకు ఉదయం స్నానానికి వేడి నీళ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు,ప్రతిరోజు వంటశాల, స్టోర్ రూమ్, త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థులకు జెఈఈ మరియు నీట్ కు ప్రిపేర్ అయ్యేవారికి తగిన సలహాలు బోదించారు,
ఆర్ ఓ ప్లాంట్ వాటర్ చెక్ చేసి రిపేర్ చేయాలని సంబంధిత ఎ ఈ కి ఆదేశించారు,అలాగే
భూసిమెట్ట కళాశాలలో కాంపౌండ్ వాల్ మరియు ఆర్ ఓ ప్లాంట్ రిపేర్ చేయాలని ఎఈ అన్నారు,ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఉట్నూర్ అదనపు పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది




