జనం న్యూస్ 05 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్‌విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో తే.23.11.2025 దిన నమోదైన కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు రూరల్ సర్కిల్ కాయలయంలో డిసెంబర్, 4న నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.వివరాల్లోకి వెళితే… తే.23.11.2025దిన మధ్యాహ్నం విశాఖపట్నంకు చెందిన మహేష్ కుమార్ యాదవ్, కోస్ట్ గార్డ్ విజయనగరంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి విజయనగరం వచ్చాడు. తన ఫ్రెండ్ని కలిసి ఇద్దరూ ఒక స్కూటీ మీద డెంకాడ నుండి రామనారాయణం వెళ్తుంటే మార్గమధ్యలో పడాలపేట వెళ్లే మార్గంలో కొంత మంది వ్యక్తులు ఒక కారు మీద వచ్చి స్కూటీని అడ్డగించి డిఎస్పి అని చెప్పి అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేసి అక్కడినుంచి కారులో తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి డబ్బులు డిమాండ్ చేసి మెడలో చైన్, చేతి ఉంగరం, రూ. 10,000లు దోచుకొని, తర్వాత రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఖాళీ పేపర్ మీద సంతకాలు పెట్టించి, 20 లక్షలు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించి వైజాగ్ లో విడిచిపెట్టేసారని విజయనగరం రూరల్ పోలీసులకి ఫిర్యాదు చేయగా, వెంటనే రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు కేసును చేధించేందుకు పోలీసు బృందాలగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా, తే 03.12.2025 దిన మధ్యాహ్నం విజయనగరం జిల్లా, చెల్లూరు బైపాస్ రోడ్డు దగ్గర గల కే.వి.ఆర్ లే అవుట్ వద్ద నిందితులు 1) కిలపర్తి నాగంనాయుడు, 38 సం., కుమ్మరి వీధి, కొత్తపేట, విజయనగరం, 2) కొన్న రామకృష్ణ, 43 సం., గాజులరేగ, విజయనగరం, 3) బుడ్డ పరమేష్, 26 సం, మదురవాడ, విశాఖపట్నం జిల్లా, 4) నేలతేటి చిరంజీవి, 25 సం.ఎం.వి.పి. కాలనీ, విశాఖపట్నం జిల్లా వారిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారని తెలిపారు. నిందితుల వద్ద నుండి 03 కారులను, 04 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో నలుగు నిందితుల కోసం గాలింపు చేపదుతున్నామని, త్వరలో పట్టుకుంటామని విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు తెలిపారు.ఈ కేసులో ముద్దాయిలను పట్టుకోనుటలో క్రియాశీలంగా పనిచేసిన విజయనగరం రూరల్ ఎస్ఐ వి.అశోక్ కుమార్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ గారు అభినందిన్చినట్టు తెలిపారు.


