జనం న్యూస్ 05 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్‌ఇటీవల కాలంలో ఏజెన్సీలోని వసతి గృహాల్లో విద్యార్థినుల మృతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమాధానం ఇచ్చారు. పాలకొండలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో 2023లోనే 66 మంది చనిపోయారని, అప్పుడు మీరు ఏ గాడిదలను కాశారని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు గత ప్రభుత్వంలో కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేదన్నారు.


