జనం న్యూస్ ; డిసెంబర్ 5 శుక్రవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి;సిద్దిపేట:
శ్రీ వాణి స్కూల్‌లో ఇటీవల నిర్వహించిన ఒలంపియడ్ ఇంగ్లీష్ పోటీ పరీక్షలో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్.సత్య మెరిట్ సర్టిఫికేట్లు మరియు పతకాలను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులు సాధారణ పాఠ్యాంశాలతో చందువుతో పాటు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కూడా సిద్ధం కావాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పోటీలు వారి ఆలోచనా శక్తి, భాషా నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించడంలో ముఖ్య భూమిక వహిస్తాయని పేర్కొన్నారు.పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులను స్కూల్ మేనేజ్‌మెంట్, అభినందించింది. ఈ సందర్భంగా బహుమతులు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేసి వారి కృషిని ప్రశంసించారు. ఉపాధ్యాయుల శ్రద్ధ, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల క్రమశిక్షణ ఈ విజయానికి మూలకారణమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని స్కూల్ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


