Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు

ఏపీ దేశంలో నెంబర్-1 గా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మాజీమంత్రి ప్రత్తిపాటి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీయే కూటమినేతల ప్రధాన లక్ష్యం కావాలి పుల్లారావు.

వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, జగన్ రెడ్డి దుర్మార్గాల నుంచి రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడామనే ఆనందాన్ని మించిన పదవులు ఉండవు పుల్లారావు.సమర్థత, అర్హతను బట్టే పదవులు వరిస్తాయనే వాస్తవాన్ని నాయకులు గ్రహించాలి : పుల్లారావు.కూటమిప్రభుత్వ 7 నెలల పాలనా విజయాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప ఆలోచనల గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీయే లక్ష్యంగా కూటమినేతలు ఐకమత్యంగా సమన్వయంతో పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. సోమవారం నరసరావుపేట పట్టణంలోని నవయుగ కన్వెన్షన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ- కూటమిపార్టీల సమన్వయం.. సన్నద్ధత, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన సమీక్ష పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా ఎంఎల్ఏ లతో మరియు మూడు పార్టీల శ్రేణుల నాయకుల సమావేశంలో పాల్గొని ప్రత్తిపాటి కీలకసూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకంటే, భారీ మెజారిటీయే ప్రధానలక్ష్యంగా కూటమినేతలు పనిచేయాలని పుల్లారావు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు భేషజాలకు పట్టింపులకు పోకుండా ఐకమత్యంగా సమన్వయంతో పనిచేస్తే ఏ ఎన్నికల్లోనైనా విజయం సునాయాసమే అవుతుందన్నారు. మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయడం అందరం గర్వించాల్సిన విషయమని, ఆయనకు పల్నాడు జిల్లాలో ఎక్కువ మెజారిటీ వచ్చేలా అందరం పట్టుదలతో పనిచేద్దామని పుల్లారావు పిలుపునిచ్చారు.

వైసీపీ, జగన్ దుర్మార్గాలు, అరాచకాల నుంచి రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడామనే సంతోషాన్ని మించిన పదవి ఏముంది పుల్లారావు

కూటమిపార్టీలను ప్రజలు ఆదరించి, భారీ మెజారిటీ ఇచ్చినందునే నేడు అందరం స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నామని, లేకుంటే తప్పుడు కేసులు.. చట్టవిరుద్ధమైన అరెస్ట్ లతో నిత్యం భయాందోళనతో గడపాల్సి వచ్చేదని, అభధ్రతాభావంతో ఉండేవారమని, ఇది ఎవరూ కాదనలేని వాస్తవమన్నారు. గతప్రభుత్వ అరాచకాలు, జగన్ రెడ్డి దుర్మార్గాల నుంచి, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడామనే ఆనందంతో పాటు మనం కూడా బయటపడ్డామనే సంతోషంతో ఉన్నామని, వీటిని మించిన పదవులు ఉండవనేది తన అభిప్రాయమని పుల్లారావు స్పష్టం చేశారు. ఎవరికి వారు వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి, ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

కూటమిప్రభుత్వం, చంద్రబాబు మరో పదేళ్లు అధికారంలో ఉండాలన్నదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష..అభిమతం పుల్లారావు.

పదవులకోసం ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంత పోటీ ఉందని, ఆశావహులందరికీ రాష్ట్రస్థాయి పదవులు ఇవ్వడం అధినాయకత్వానికి కూడా సాధ్యంకాదనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలని పుల్లారావు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ లకు కూడా తమనాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటుందని, కానీ పరిస్థితులతో పాటు సమర్థత.. అర్హతలను బట్టి వారి నిర్ణయాలు ఉంటాయనే వాస్తవాన్ని అందరం గుర్తెరగాలన్నారు. ఎవరూ అసంతృప్తితో ఉండాల్సిన పనిలేదన్నారు.స్థాయికి మించిన ఆలోచనలు.. పదవులు, అర్హతకు మించిన వాదనలు ఎవరికీ, ఏ పార్టీకి మంచివి కాదన్నారు. కూటమిప్రభుత్వం, చంద్రబాబు మరో పదేళ్లు అధికారంలో ఉండాలని.. ఏపీని ప్రపంచం గర్వించేలా దేశంలో నంబర్-1 నిలపాలన్నదే ప్రజలందరి ఆకాంక్ష, అభిమతమని పుల్లారావు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాకు సమర్థవంతమైన నాయకత్వం ఉందని, అందరం ఒకతాటిపై నిలిచి ప్రజలకోసం పనిచేస్తే సాధించలేనిది ఏదీ ఉండదని మాజీమంత్రి తేల్చిచెప్పారు.