

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
ఎస్. శివశంకర్ మృత దేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద దర్శించి, నివాళులు అర్పించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రంగనాయకులు మరియు రాష్ట్ర, గుంటూరు జిల్లా కమిటీ నాయకులు. అనంతరం శివశంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. సంఘం తరఫున 10వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోడపాటి సుబ్బారావు, రాజుపాలెం కోటేశ్వరరావు, మాలెంపాటి శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షులు వాసిమళ్ల రాజేష్, కార్యదర్శి లాల్ అహ్మద్, కోశాధికారి వేరువ శివశంకర్, ఉపాధ్యక్షులు శివయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబశివరావు, కమిటీ సభ్యులు లక్ష్మణ్, బత్తుల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.