

జన న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం
పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బీరవల్లి సుధాకర్ రెడ్డి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బీరవల్లి సుధాకర్ రెడ్డి చెప్పిన వివరాలు మేరకు తనను గత ఆరు నెలలుగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ తనను విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నా డ్యూటీని నన్ను చేయనీయకుండా తనపై చేస్తున్న ఒత్తిడి వల్లనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. మెరుగైన వైద్యం కొరకు బాధితుడిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.