జనం న్యూస్ డిసెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని వసంతపూర్ గ్రామంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో బిజెపి జిల్లా నాయకులు లాడే శివ బూత్ అధ్యక్షులు చల్ల ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.
చేరిన వారికి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి
బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ,“ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రామాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా ఉపయోగపడుతున్నాయి. వసంతపూర్ ప్రజలు బీజేపీ పట్ల చూపుతున్న విశ్వాసం ఎంతో ఆనందదాయకం. చేరిన నాయకులు గ్రామ అభివృద్ధికి మరింత బలం చేకూరుస్తారని నమ్ముతున్నాం” అని అన్నారు అనంతరం నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ, వసంతపూర్‌లో బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతుండటం చాలా సంతోషంగా ఉందని, చేరిన నాయకులు–కార్యకర్తలు గ్రామ స్థాయిలో పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరవేసి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.బీజేపీలో చేరిన వారు భుజంగరావు , లక్ష్మీ, వినోద్, సుమన్, ప్రకేష్, అశోక్, ప్రసాద్, శివ, రాజు, జనార్ధన్, శశికుమార్, చారి, రాజు, ప్రదీప్, నాగరాజు, సాయికిరణ్, ప్రదీప్, అజయ్, పవన్, లక్ష్మణ్, రాజు విజయ్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రాయరాకుల మొగిలి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రవి కిరణ్, మండల అధ్యక్షుల నరహరిశెట్టి రామకృష్ణ,మండల ప్రధాన కార్యదర్శిలు మామిడి విజయ్ తిరుపతి నాయకులు ఉప్పు రాజు, చల్ల రఘుపతి రెడ్డి, ఎర్ర రాకేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…


