Listen to this article

జనం న్యూస్ – డిసెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ పట్టణ పర్యటనను పురస్కరించుకొని నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులను నాగార్జునసాగర్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో, ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేరని రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ కౌన్సిలర్ రమేష్ జి, సభావాత్ చంద్రమౌళి నాయక్, గుజ్జుల కొండలు, చల్లా బ్రహ్మo, బిజెపి పార్టీ టౌన్ అధ్యక్షులు గణేష్ తంగరాజు, ఎస్సీ మోర్చా నాయకులు కొమ్ము రాందాస్ తదితరులు ఉన్నారు.