Listen to this article

జనం న్యూస్- డిసెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అలుకూరి శ్రీనివాస్ శ్రీ కాలనీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఈరోజు రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నామంటే రాజ్యాంగం యొక్క గొప్పతనమే అని, అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో యువత ముందుండాలని ఆయన అన్నారు.
కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూసమాజంలో అన్ని కులాలు ఆర్థికంగా సామాజికంగా గౌరవంగా జీవించాలని సంకల్పంతో ఆయన భారత రాజ్యాంగాన్ని రచించారని ప్రజలందరూ అంబేద్కర్ కలలుగన్న సమసమాజం వైపు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు గుంటి సూర్య కోటేశ్వరరావు, మన మహానాడు టౌన్ ప్రెసిడెంట్ సాగర్ బాబు, బత్తుల ప్రకాష్, టౌన్ సెక్రెటరీ ఆనంద్ విజయ్, కోశాధికారి భూపతి రవి, మర్రి నరేందర్, సువర్ణ రాజు, సిపిఎం నాయకులు నాగార్జున, మహారాజుల సేవా సంఘం సభ్యులు నకులరావు, జి బద్రి, వీరబాబు, డి సతీష్, స్థానిక యువకులు నక్క కిషోర్, జంగా ప్రకాష్, ప్రమోద్, రిటైర్డ్ విఎఓ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.