Listen to this article

జనం న్యూస్‌ 07 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌విజయనగరం

నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువులో పెంపకానికి వేసిన చేపలు మృత్యువాత పడ్డాయి. దీని వల్ల వస్తున్న దుర్వాసనను భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మొదలుకొని బాలాజీ జంక్షన్, తోటపాలెం, ఎత్తు బ్రిడ్జి, రైల్వే స్టేషన్ ఏరియా వరకు ఈ దుర్వాసన బాగా ఇబ్బంది కలిగిస్తోంది. మునిసిపల్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి, దీని నుంచి విముక్తి కలిగించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.కానీ, ఈ చేపలు ఎందుకు చనిపోయాయని మీరు అనుకుంటున్నారా?మనమంతా చెత్తాచెదారం, పాలిథీన్ వస్తువులను చెరువులో వేయడం వల్లే కదా!