Listen to this article


జ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 8 నియోజకవర్గంలో

ప్రధాన పంట చెరుకు రైతులు ప్రధానంగా చెరుకు పంటను పండిస్తారు.ఈ కర్మాగారం క్రింద 8 మండలాలు ఆధారపడి ఉంటాయి సుమారు 26,000 పై చిలుకు ఎకరాల్లో రైతులు చేరుకును పండిస్తారు ఈ కర్మాగారంపై సుమారు 10,000ల రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ సంవత్సరం అధిక వర్షాలు పడి చెరుకు దిగుబడి తగ్గి తాము పండించిన చేరుకును వారు ఎక్కడ వెయ్యాలో అర్థంకావడంలేదు సరైన మద్దతు ధర ప్రకటించిన దాఖలాలూ లేవు దళారుల బెడద కూడా ఎక్కువ అయింది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే కర్మాగారాన్ని తెరిపిస్తామని మాటిచ్చి ఓట్లు దండుకోని అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏమీ పట్టనట్లు ఉండటం శోచనీయం.ఇది ప్రజలను మోసాగించడమే కర్మాగారం ప్రారంభించడానికి ప్రయివేటు యాజమాన్యాలు ముందుకు రాకపోతే ప్రభుత్వమే చొరవ తీసుకొని రైతుల బాధలను దృష్టిలో పెట్టుకొని సరైన మద్దతు ధర ప్రకటించాలి,అదే విదంగా ప్రభుత్వమే ముందుకు వచ్చి కొత్తూర్ బి.చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్,లు ఉన్నారు