విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 09 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2025 నం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన బొండపల్లి సత్యారావు (59 సం.లు)కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే. నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5వేలు జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ డిసెంబర్ 8న తీర్పు వెల్లడించారని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన బొండపల్లి సత్యారావు, (59సం.లు) తన మనవరాలు అయిన ఒక మైనరు బాలిక (6 సం.లు)ను ఇంట్లో ఎవరు లేని సమయంలో బలాత్కారం చేసాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి మహిళా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, మహిళా పిఎస్ ఎస్ఐ జి.శిరీష తే. 18-08-2025 దిన పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసారన్నారు. అనంతరం, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.నిందితుడు బొండపల్లి సత్యారావు (59సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి గారు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేలు జరిమాన విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం.ఖజానారావు వాదనలు వినిపించారన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్థవంతంగా పని చేసిన మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, సి.ఐ. ఇ.నరసింహ మూర్తి, సి.ఎం.ఎస్. హెచ్.సి. సిహెచ్, రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు జి.సూరపు నాయుడు, స్పెషల్ పిపి ఎం.ఖజానా రావులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.


