జనం న్యూస్ 09 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా పి.డి.ఎస్.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు జిల్లా కేంద్రంలో వాల్మీకి ఫంక్షన్ హాల్ లో ప్రగతిశీల ఆదర్శ గ్రామపంచాయతీ కార్మికుల మహాసభను జయప్రదం. తెలంగాణ ఆదర్శ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ నిర్వహించిన జిల్లా 5వ, మహాసభ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ జెండా ఆవిష్కరించగా అనంతరం జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా హాజరై పి.డి.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ. కార్మికుల వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని,కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని,8 గంటల పని విధానమే కొనసాగించాలని, 2024 జనాభా ప్రకారం ఉద్యోగ సిబ్బందిని నియమించి పని ఒత్తిడి తగ్గించాలని, ఐ.ఎఫ్.టి.యూ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 కు సవరించి అమలు చేయాలి అన్నారు.పని భారం తగ్గించాలి అదునపు భారం తగ్గించాలి అధునిక సిబ్బందిని నియమించాలి సిబ్బందిని నియమించాలి డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు తొలగించడం ఆపాలి అని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులకు రెగ్యులర్ రేట్ చేయాలి తెలిపారు.ప్రమాదం లో మరణించిన కార్మికులకు 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి .సహజ మరణానికి ఐదు లక్షలు బీమా కల్పించాలి.కనీస వేతనాలు ఇవ్వాలి. 68 జీవోలను వెంటనే విడుదల చేయాలి విడుదల చేసిన ఐదు జీవులు 21 నుండి 25 లను వెంటనే రాజపత్రం ముద్రించాలి అని అన్నారు.కార్మికుల సమస్యల కోసం పోరాడుతూనే, కార్మికుల వేతనాలు రెగ్యులర్గా చెల్లించాలని,పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపచేయాలని,అక్రమ తొలగింపులు ఆపాలని అనేక సమస్యలపై ఎన్నెన్నో ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడం జరిగిందని దాసి తెలిపారు. కార్మికుల సమస్యలు తీరని పక్షంలో సెక్రటేరియట్ ముట్టడిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో.. అడ్వకేట్ మధుసూదన్ బాబు, టీపీఎఫ్, శంకర ప్రభాకర్, పి వై ఎల్, బీరెల్లి దానయ్య, పిడిఎస్యు. హలీం పాషా, ఎండి గౌస్, నాగన్న,బింగిదొడ్డి శ్రీనివాస్, గంజిపేట కోళ్ల అంజి, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు..


