జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మన భారత పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీ.కే. అరుణ తాజాగా ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లో సభ్యురాలిగా నియమితులయ్యారు ఈ కమిటీ భారత రాజ్యాంగ 130వ సవరణ) బిల్లు, 2025జమ్మూ & కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2025యూనియన్ టెర్రిటరీస్ (సవరణ) బిల్లు, 2025 వంటి మూడు కీలక బిల్లులను పరిశీలించనుంది.తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను 30 రోజుల నిర్బంధం ఉన్నచో పదవులనుండి తొలగించే నిబంధనలను ఈ బిల్లులు ప్రతిపాదిస్తున్నాయి. అంతకుముందు కూడా 2024 ఆగస్టులో ఏర్పాటు చేసిన డబ్ల్యూ ఏ క్యూ ఎఫ్ బిల్లు , 2024 పై జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు.మన తెలంగాణకు ఇది గర్వకారణం దేశ చట్టాల రూపకల్పనలో పాలమూరు పార్లమెంట్‌కి ప్రతినిధిత్వం కల్పించడం నిజంగా గర్వించదగ్గ విషయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట అత్యున్నత విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం మరో గురుతర బాధ్యతను అప్పగించి, అరుణమ్మ పనితీరును గుర్తించడమంటే ఆమె వెంట ఉన్న ప్రతి పాలమూరు పార్లమెంట్ బీజేపీ కార్యకర్తను గుర్తించడమే. జై హింద్… జై భారత్…


