జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కేసు నమోదు నుంచి తీర్పు వరకు… పోలీసుల కట్టుదిట్టమైన ఫాలోఅప్ ఫలితo ఈ కఠిన శిక్షలు నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ కు చెందిన కృష్ణవేణి హరిత అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నా డు అని ప్రియుడు తో కలిసి భర్తను చంపిన కేసులో ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికీ 5000/- రూపాయాల జరిమానా విధిస్తూ ఈ రోజు తేది:09.12.2025 న గౌరవ ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి – *శ్రీమతి ఎన్. ప్రేమలత* తీర్పును వెల్లడించారు.*వివరాలు*:శ్రీ కాకనూరి గోపీ S/o లేట్ వెంకటస్వామి, వయసు: 34 సంవత్సరాలు, కులం: చాకలి, ఉద్యోగం: జోగుళాంబ ఆలయం అటెండర్, % హౌస్ నం. 10-88, చాకలి వీధి, అలంపూర్ గ్రామం & మండలం అను వ్యక్తి తేది:04-06-2019 రోజు అలంపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇచ్చిన పిర్యాదు ఏమనగా ఫిర్యాదుదారుడు తన ఇంటి వద్ద ఉండగా, శకుంతల భర్త అయినా రవి మా ఇంటికి వచ్చి మీ వదిన ఫోన్ చేసింది, మీ చిన్న అన్న ను కొడుతున్నారు అని ఆందోళనగా చెప్పింది అని తెలిపినాడు. అప్పుడు ఫిర్యాదుదారుడు వాళ్ళ వదిన నెంబర్ తీసుకుని ఆమెకు కాల్ చేయగా, హిమంపురంకు దగ్గరలో రోడ్డుపై ఉన్నామని తెలపడం జరిగింది. వెంటనే ఫిర్యాదుదారుడు తన మిత్రుడు మహేష్ ను వెంట తీసుకుని వెళ్ళగా ఇమాంపురం దగ్గరలో రోడ్డుపై ఉన్నతన వదినను ఏమైంది అని అడగగా, కీర్తిని కర్నూలు హాస్పిటల్ కు ఇసుక వెళ్లి, తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు బైక్స్ పై వచ్చి, బీర్ బాటిల్ తో నా భర్తను తలపై కొట్టి, పోలాల్లోకి ఈడ్చుకుపోవడం జరిగింది అని, ఆమె భయభ్రాంతులకు గురై పొలాల్లో దాకున్నానని తెలిపింది. మీ అన్నకు ఏమైందో చూడు అనగా పిర్యాదు దారుడు సెల్ఫోన్ టార్చ్ లైట్ తో పొలంలో వెతకగా ఫిర్యాదిదారుని అన్న చకలిశాలు ఆటో శాలు S/o లేట్ వెంకటస్వామి, వయసు 36 సంవత్సరాలు కి తలకు రక్త గాయమై గొంతు కోయబడి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. అలాగే రోడ్డుపై గల మోటార్ సైకిల్ టీఎస్ 33పి7327 నెంబర్ను నోట్ చేసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు ఇవ్వగా అలంపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై మధుసూదన్ రెడ్డి క్రైం నెo. 102/2019, అండర్ సెక్షన్: 302,182, r/w 34, 109 ఐ.పి.సి గా కేసు నమోదు చేయడం జరిగింది. అలంపూర్ సిఐ జి రాజు విచారణలో భాగంగా మృతుని భార్య అక్రమ సంబంధం కొరకు కొంత మందితో కలిసి ఈ హత్యను చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఇట్టి విషయమై తేది:07- 06- 2019 న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడo జరిగింది. అనంతరం వెంకటరామయ్య అలంపూర్ సీఐ ఈ కేసులో తేది:30-07-2020 న కోర్టుకు చార్జిషీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇట్టి కేసులో గౌరవ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు గద్వాల్ కేసు పూర్వపరాలను విచారించి, వాదోపవాదనలు విన్న తర్వాత తేది 09.12.2025 నాడు నిందితులు ఎ-1 చాకలి కృష్ణవేణి హరిత, వయసు 30, అటెండర్, అలంపూర్.ఎ-2 సాంకటి మహేష్, వయసు 23, వ్యవసాయం, లింగానవాయి.ఎ-3.దాదపోగు మహేష్ @ గణ, వయసు 20, ఆటో డ్రైవర్, కర్నూలుఎ- 4 ఈడిగ మహేంద్ర, వయసు 20, పెయింటర్, కల్లూరు /కర్నూలు.ఎ-6 హుల్చా రాజా సురి, వయసు 22, ఆటో డ్రైవర్, కలుగోత్ల/కర్నూలుఅను నిందితులపై మృతుని కుమార్తె యొక్క బలమైన ఎవిడెన్స్ మరియు పోలీసు వారి ఎవిడెన్స్ తో నేరం రుజువు కావడం జరిగింది. ఇట్టి హత్యతో కేసులో గౌరవ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీమతి ప్రేమలత ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల జరిమానా విధించడం జరిగినది.ఈ సందర్బంగా కోర్టులో నిందితులకు శిక్ష పడేలా కోర్టులో సాక్షులకు తగిన బ్రీఫింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసిన డిస్ట్రిక్ట్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోదాచారి, అదనపు ఎస్పీ కె.శంకర్, డి.ఎస్పీ. మొగిలయ్య, అలంపూర్ సిఐ రవిబాబు, అలంపూర్ ఎస్సై వెంకటస్వామి, కోర్టు లైసెన్ ఆఫీసర్స్ ఎస్సై జిక్కి బాబు, ఏఎస్ఐ ప్రసాద్, సి.డి.ఓ. మాభాష పిసి.711 అధికారులను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు అభినందించారు.


