మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో సత్తయ్య
జనం న్యూస్,డిసెంబర్ 10,కంగ్టి,సంగారెడ్డి జిల్లా
కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల నియమావళి నియమ నిబంధనలు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆయా గ్రామాలలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్,వార్డు సభ్యులు,ఎన్నికల్లో ఖర్చు చేసే ప్రతి పైసా ఆధారాలతో లెక్కలు చూపించవలసి ఉంటుందని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు తాము సమర్పించిన బ్యాంక్ అకౌంట్ ద్వారా నె డబ్బులు ఖర్చు చేయవలసి ఉంటుందని అన్నారు.అభ్యర్థి ఖర్చు చేసిన వివరాలను ఏమాత్రం అధికారికంగా చుయించనట్లయితే ఎన్నికల్లో గెలిచిన ఎన్నికల అధికారులు వివరాలు చూపించని ఆ వ్యక్తి గెలుపును తిరస్కరించవచ్చని అన్నారు.స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరు సర్పంచ్ అభ్యర్థి అక్షరాల 1,50,000, వార్డ్ సభ్యులు, అక్షరాల 30,000,రూపాయలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుందని అన్నారు. సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి కారు వాడినట్లయితే ఎమ్మార్వో దగ్గర అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. పోటీ చేసే ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా సజావుగా జరుపుకోవాలని అభ్యర్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో భాస్కర్,ఎన్నికల అబ్జర్వర్ ఏఈఓ శ్రీనివాస్,ఎస్ఐ దుర్గా రెడ్డి,సర్పంచ్ అభ్యర్థులు,వార్డు సభ్యులు,తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి ఎన్నికల నిర్వహణ అధికారికి


