న్యూస్ డిసెంబర్ 10
వైసిపి కోటి సంతకాల ఉద్యమం ప్రజలు మద్దతు లేక సంతకాలు చేయడానికి ముందుకు రాకపోవడంతో వైసిపి కార్యకర్తలు కోటిపాట్లు పడుతున్నారని, విజయోత్స సభలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని రాజానగరం బిజెపి సీనియర్ నాయకులు వీరన్న చౌదరి ఎద్దేవా చేశారు. రాజానగరం నియోజవర్గంలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పి పి పి మోడల్ ద్వారా వేగంగా నిర్మాణం చేసి పేదలకు వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ ఉద్దేశం అని చౌదరి అన్నారు. వైసీపీ పార్టీ వారి స్వలాభం కొరకు తప్పుగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, నాడు జగన్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం, సుమారు 1550 కోట్లు సాయం చేస్తే వాటిని సద్వినియోగం చేయకుండా దారి మళ్లించారని, నా బోర్డు నిధుల నుంచి కూడా రుణాలు పొంది కొన్ని నిర్మాణాలను పునాదులుకే పరిమితం చేశారని ఆరోపించారు. జగన్ విశాఖ ప్యాలస్కు 500 కోట్లు ఖర్చుపెట్టారు తప్ప జగన్ ప్రభుత్వం నుండి మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు కేటాయించకపోవడంపై వైసీపీ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


