జనం న్యూస్ డిసెంబర్ 10
హైదరాబాద్ ఆదివాసి హక్కుల సంఘీభావ వేదిక సభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రంగారెడ్డి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ.జవహర్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభ అధ్యక్షురాలిగా చైతన్య మహిళా సంఘం ఇ.జయ.సభలో ఆవిష్కరించిన మహిళ లేని చరిత్ర లేదు” పుస్తక కార్యక్రమం.ఆదివాసులను వారికి అండగా నిలిచిన మావోయిస్టు ఉద్యమకారులను కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు భూటకపు ఎన్కౌంటర్ల హత్యలకు, ఆదివాసి ప్రజల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడడం అమానుషం, అప్రజాస్వామికం అని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ఇంత క్రూరమైన, దుర్మార్గమైన అమానవీయ ప్రభుత్వ హత్యలను వెంటనే ఆపి, ఆదివాసి ప్రజల 1996 పేసాచట్టం, 2006 అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని, అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో జరిగిన ప్రభుత్వ హత్యలపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జీచే న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 1948, డిసెంబర్-10 అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాప్రా-జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో జరిగిన సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఆదివాసి హక్కుల పోరాట సంఘీబావ వేదిక హైదరాబాద్ రంగారెడ్డి కమిటి ఆధ్వర్యంలో 2025, చంద్రపురి కాలనీ, కమ్యూనిటీ హాలులో బుదవారం రోజు బహిరంగ సభ జరిగింది. చైతన్య మహిళా సంఘం ఇ.జయ అధ్యక్షతన జరిగిన సభలో వివిధ ప్రజాసంఘాలకు చెందిన నేతలు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ దేశాలు తమ ప్రజల హక్కులను బాద్యతగా గుర్తించి, వాటి సంక్షరణకు పాటుపడాలని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి సూచిస్తూనే ఉంటుదని, కానీ 78 సంవత్సరాల స్వతంత్ర దేశంగా చెప్పుకొంటున్న భారత్ లోని దళారీ దోపిడి పాలకులు జీవించే హక్కు తోపాటు మత విశ్వాసాలను, సమన్యాయ పౌర ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. మనిషిని మనిషిగా గౌరవించలేని విధానాలతో మానవహక్కులను మంట గలుపుతున్నారని మండిపడ్డారు. దేశ సంపదలను, వనరులను బడా కార్పొరేట్ సామ్రాజ్యవాదుల సంస్థలకు దోచిపెట్టే కుట్రలో బాగంగానే ఆదివాసీలను బలవంతంగా అడవి నుండి వెళ్ళగొట్టే చర్యలు బీజేపీ నరేంద్రమోదీ, అమిత్ షాల ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. అందుకే ఆపరేషన్ కగార్ పేరుతో 2026, మార్చ్ చివరి తేదీలోపల నక్సల్ రహిత భారత్ గా మారస్తామనే పేరిట రాజ్యాంగ బద్దమైన ప్రజాస్వామ్య విలువల హననాన్ని కాలరాచి, మారణహోమానికి పాల్పడుతున్నదని గుర్తు చేశారు. పైగా ఆర్భన్ నక్సలైట్ల పేరిట ప్రశ్నించే, పోరాడే మేదావులు, నాయకులను వదలమని బహిరంగ బెదిరింపులతో ఉద్యమ శక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేసే చర్యలు వేగమంతం చేసిందని పేర్కొన్నారు. బుద్దిజీవులు, ప్రగతిశీల శక్తులు ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమాల నిర్మాణానికి పూనుకొని, సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికైన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేర్కొంటున్న పాలకులు కార్పొరేట్ల ప్రయోజనాలకోసం చేసుకున్న అక్రమ ఎంఓయులను రద్దుచేసి, గత రెండు సంవత్సరాలుగా జరిగిన, జరుగుతున్న ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ (పిఓడబ్ల్యూ), షేక్ షావలి (ఐ.ఎఫ్.టి.యు), గడ్డం సదానందం (సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్), కుమార్ (ఏ.ఆర్.కె.ఎస్.ఎస్), ముత్తన్న (టిపిఎఫ్), మల్లేష్ (ఏ.ఐ.ఎఫ్.టి.యు), రవి (పిడిఎం), రాము(విరసం), మమత (అంబేద్కర్ సంఘం), విజయ్ (న్యూడెమోక్రసీ), రాజనర్సింహ (పికెఎం), భవానీ (ఏబిఎంఎస్), జీ.గోపాల్ (తెలంగాణ రైతు సమితి) ముస్లిం కమిటీ ఎం.డి.పాషామియా, కేహెచ్పీఎస్ జంబుక తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. సభలో పికెఎం, అరుణోయ కళాకారులు ఆలపించిన ఉద్యమ పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. అనంతరం మానవ, పౌర ప్రజాస్వామ్య హక్కులు వర్ధిల్లాలని, ఆపరేషన్ కగార్ ఎత్తివేసి శాంతి చర్చలు జరపాలని నివేదించారు మహిళామార్గం ప్రచురించిన ‘మహిళ లేని చరిత్ర లేదు’ అనే పుస్తకాన్ని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ చేతులమీదుగా ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక సభలో ఆవిష్కరించారు….


