తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10 డిసెంబర్
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనపై జమిందారీ వ్యవస్థపై పోరాడిన బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలను జహీరాబాద్ పట్టణంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల నాయకులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. పండుగ సాయన్న ముదిరాజ్ 1860 నుండి 1900 కాలంలో నాటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకించారని బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్న జమిందారి, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ధీశాలీగా పోరాడారని కొనియాడారు.ఆయన సంపన్న వర్గాలను కొల్లగొట్టి పేద వర్గాలకు పంచిన గొప్ప వ్యక్తి అని అందుకే ఆయనను ‘తెలంగాణ బందుక్’గా అభివర్ణించారు. ముఖ్యంగా ఆయన ప్రత్యేక బీసీ సామ్రాజ్యం కోసం, సామాజిక న్యాయం దిశగా పోరాటాలు చేస్తూ బీసీల సామ్రాజ నిర్మాణానికి కృషి చేశారని గుర్తు చేశారు ఈ కారిక్రమంలో బి.సి చైర్మన్ పెద్దవల్ల నారాయణ, గౌరవ అధ్యక్షులు నర్సింలు, ,,మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు,, బుడగ జంగం నాయకులు మాదినం శివప్రసాద్, ప్యార్ల దశరథ్, గ్రామాయణం చిత్రం నిర్మాత మధుసూదన్ శాంతకుమార్, ప్రశాంత్, అభిషేక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


