Listen to this article

జనం న్యూస్‌ 11 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం కలెక్టర్ రామసుందర్ రెడ్డి పనితీరుకు సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 3వ ర్యాంక్ ఇచ్చారు. ఆయన వద్దకు వచ్చిన సమస్యలలో 791 క్లియర్ చేశారు. వాటిలో ఒక్కోదానికి 18 గంటల సమయం తీసుకున్నారు. అలాగే మంత్రి సంధ్యారాణికి 19 ర్యాంక్ వచ్చింది. 545 సమస్యల పరిష్కారానికి ఆమె 8 రోజుల 8 గంటల 8 నిమిషాలు తీసుకున్నారు. కాగా మంత్రి సంధ్యా రాణి పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.