పింకీ దత్త రెడ్డీ కొంసాని,
గ్రామ సేవే లక్ష్యంగా,గ్రామ అభివృద్ధి ధ్యేయంగా,
జనం న్యూస్,డిసెంబర్ 11,నారాయణాఖేడ్,సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్ మండల పరిధిలోని సంజీవన్ రావ్ పేట్,గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి పింకీ దత్త రెడ్డీ కొంసాని, గ్రామానికి అభివృద్ధి చేసే నేపథ్యంలో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి,నన్ను గెలిపించినట్లయితే గ్రామంలో చేపట్టే ఇరవై అభివృద్ధి పనులను స్టాంప్ పేపర్ పై రాసి సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే దోచుకోవడం దాచుకోవడం కాకుండా, గ్రామ అభివృద్ధికి పాటుపడతానని ముందుగానే గ్రామస్తులకు స్టాంప్ పేపర్ పై 20 హామీలను రాసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు.నేను రాసి ఇచ్చిన వాటిలో ఏ ఒక్క దానిని కూడా విస్మరించకుండా రాసి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తానని అన్నారు. *రాసిచ్చిన హామీలు** గ్రామానికి గ్రంథాలయం,గ్రామ ప్రవేశంలో కనివిని ఎరగని రీతిలో కమాన్,పెళ్లిళ్లకు ఆడపడుచు కట్నం గా ₹2111 చీర, గ్రామానికి వైకుంఠ రథం,అంతిమ సంస్కారాలకు ₹5111, గ్రామంలోని ప్రధాన కూడలిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు,యువకుల కొరకు స్పోర్ట్స్ కమిటీ,ప్రతి ఏటా టోర్నమెంట్, యువకులు పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన, ఉద్యోగాలు పొందిన, పదోన్నతి పొందిన, వారికి సత్కారాలు నిర్వహించి,వారి ప్రతిభాను భవిష్యత్తు తరానికి అందిస్తాం, ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామస్తుల ఆరోగ్య ని గ్రామస్తుల ఆరోగ్య రిత్య ప్రముఖ వైద్యులతో మెడికల్ క్యాంపు నిర్వహిస్తాం, గ్రామంలో ప్రతి వీధికి సిసి రోడ్డు నిర్వహిస్తాం, గ్రామంలోని హిందూ క్రైస్తవ ముస్లిం, ఆలయాలకు ప్రతి ఏటా ₹10116 అందిస్తాం, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత ప్రమాణాలను పెంచి, నూతనంగా పాఠశాల ప్రవేశం చేసిన విద్యార్థులకు ₹ 1016 నగదును అందిస్తాం, గ్రామంలోని ముఖ్య 18 మంది పనివారికి దసరా పండగకి బట్టలకు ఇంటి పెద్ద కొడుకుల ₹1011 అందిస్తాం,అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, రేషన్ కార్డు, నివాసగృహం, అందిస్తాం,గృహ పన్ను మాఫీ చేస్తాం, ఇప్పుడున్న గల్లీలను వార్డులుగా విభజించి నామకరణం బోర్డులు పెట్టిస్తాం, ప్రతి వార్డులో చదువుకున్న యువకుడు,వార్డు మెంబర్,ఒక పెద్ద మనిషి తో అభివృద్ధి కమిటీతో ప్రతి నెల మీటింగ్ నిర్వహిస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి లేబర్ ఇన్సూరెన్స్ పదిలక్షలు చేయిస్తాం,వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజానీకానికి ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా చూస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు 100 శాతం అందిస్తాం,మన గ్రామ పెద్ద కొడుకుల మీతో తోడుండి చూసుకుంటా,గ్రామ సేవే లక్ష్యంగా,గ్రామ అభివృద్ధి ధ్యేయంగా, ముందుకెళతానని అన్నారు.


