జనం న్యూస్ – డిసెంబర్11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్
– నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని బస్తీ దవఖానాలో ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం నాడు నాగార్జునసాగర్ లోని పైలాన్ కాలనీలో ఉన్న బస్తీ దవఖానను ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవి, జిల్లా టి బి నివారణ అధికారి కళ్యాణ్ చక్రవర్తిలతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను, మెడిసిన్ స్టాక్ రికార్డును, రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించారు. ఎన్ సి డి మరియు ఏ ఎన్ సిల నమోదు ప్రక్రియను, వ్యాక్సినేషన్ మొదలగు వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. బస్తీ దవఖాన పరిధిలో జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలను వారి పొందుతున్న వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు. బస్తీ దవాఖాన కొచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్ హరికృష్ణను ఆదేశించారు. బస్తీ దవఖాన నర్సింగ్ సిబ్బంది ఝాన్సీ, వెంకన్న తదితరులు ఉన్నారు.


