Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా శాయంపేట గ్రామ బీ సీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయుచున్నట్లు చింతల ఉమా రవిపాల్ ప్రకటించారు శాయంపేట గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు గ్రామ అభివృద్ది సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధాన్యతలు అని పేర్కొన్నారు నిరంతరం ప్రజాసేవ చేయడం నా బాధ్యత అని హామీ ఇచ్చారు శాయంపేట గ్రామ ప్రజలు తనకు సర్పంచ్ గా గ్రామ ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు గ్రామ ప్రజల హృదయాలలో నిలవడమే నా లక్ష్యం అంటూ గ్రామ ప్రజల ఆశీర్వాదం కోరారు గ్రామ ప్రజల అభిమానం సహకారమే తమ విజయం నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట అభిమానులు పాల్గొన్నారు….