.మద్నూర్ డిసెంబర్ 11 జనం న్యూస్కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పండిత్ రావ్ పటేల్ ప్రచారం జోరు పెంచినారు. తనను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపిస్తే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అలాగే 40 ఏళ్ల రాజకీయ అనుభవంతోనే ప్రజల యొక్క కష్టసుఖాలు తెలిసినోన్ని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటూ, అందర్నీ కలుపుకొని తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని అని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. వారి వెంట గ్రామ పెద్దలు, యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారములో పాల్గొంటూ సర్పంచ్ గా పండిత్ రావ్ పటేల్ 100% గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.




