.జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 12
మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. కన్నె స్వామి వాగి చర్ల వెంకట సాయి కృష్ణ ఇంటి వద్ద జరిగిన పడిపూజ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు గురజాల మండలానికి చెందిన శ్రీ సాయి అయ్యప్ప భజన బృందం అయ్యప్ప స్వామి భక్తి పాటలతో భక్తులను తన్మయత్వంలో ముంచారు. భజన బృందం సింగర్ గుంటూరు శ్రీనివాస రావు ఆధ్వర్యంలో భక్తి పాటలను పాడారు. పడిపూజ నిర్వాహకులు వాగి చర్ల మురళీకృష్ణమూర్తి, మోహన్ రావులు ఈ పడిపూజ కార్యక్రమం నిర్వహించారు గురు స్వాములు వాడేలా కృష్ణ ప్రసాద్ వెంకటస్వామి పలు గ్రామాల అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.



