Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 12

ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే కర్తవ్యం ఏమి దైవంగా భావించి పనిచేయాలని జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి అన్నారు. సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో వివిధ పాఠశాలల్లో కర్తవ్వేమే దైవం అనే అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి మీర్జా పేట గ్రామాల్లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విజేతలకు బుధవారం బహుమతి ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా చెన్నారెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి తంగిరాల రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థి దశ నుండే విద్యతో పాటు అన్ని సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ కర్తవ్యాన్ని దైవంగా భావించి ముందుకు నడవాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజేతలుగా నిలిచిన కే సౌజన్య శ్రీవిద్య సాయి మనీషా లకు బహుమతి ప్రధానం జరిగింది ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ ఏ బిక్షమయ్య జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ టి సత్యనారాయణ జిల్లా మెడికల్ కోఆర్డినేటర్ రమణారెడ్డి జిల్లా పి ఎస్ లు బాల వెంకటేశ్వర్లు సతీష్ కుమార్ తర్లపాడు మండల సేవాదళ్ కోఆర్డినేటర్ తుమ్మలపెంట సురేష్ మండల కన్వీనర్ బి రామకృష్ణారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు పి కోటి మోహన్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు