జనం న్యూస్ డిసెంబర్ 12 సంగారెడ్డి జిల్లా
క్యాసారం గ్రామ సర్పంచి ఎన్నికల్లో అత్తిలి సంగీత గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నూతన సర్పంచ్ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భం గా సంగీత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, “మంచి పని చేసే మనిషికి గ్రామస్తులు మద్దతు ఇచ్చారు. ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తాను” అని తెలిపారు.గ్రామంలో కొన్ని ప్రధాన సమస్యలు ఇంకా ఎదురవుతున్నాయని, వాటిని ప్రాధాన్యంగా తీసుకొని ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.నూతన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కష్టపడి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ మరోసారి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.


