Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన

ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. ఏ.ఎన్.కే శర్మ 80వ జన్మ దిన సందర్భంగా, డా. శర్మ స్వగృహంలో ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు దుశ్శాలువాతో సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆశీస్సులు పొందిన వారిలో ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి, అధ్యక్షుడు గ్రంధి నానాజీ, ఆకొండి ఉమా మహేష్ శర్మ, వేదుల శ్రీనివాస్, తాతపూడి కృష్ణ, ఆణివిళ్ళ బాలా శ్రీనివాసు, ఆణివిళ్ళ ఫణికాంత్ శర్మ తదితరులు ఉన్నారు